Mahadasha for the joint Medak district

ఉమ్మడి మెదక్ జిల్లాకు మహర్దశ

Date:29/05/2020

మెదక్ ముచ్చట్లు:

ఉమ్మడి మెదక్‌ జిల్లాకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేసే గోదావరి జలాలు రాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి సిద్దిపేట జిల్లాకు వచ్చాయి. మేడిగడ్డ నుం చి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం పోసే లా డిజైన్‌ రూపొందించారు. ఫలితంగా ఉమ్మడి మెదక్‌(సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌) జిల్లా సస్యశ్యామలం కానున్నది. 318 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉన్న రాజరాజేశ్వర జలాశయం(మిడ్‌ మానేరు) నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు వచ్చాయి.అక్కడి నుంచి రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని పంపించడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీరు అందనున్నది.

 

 

 

ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటలు చెక్‌డ్యాంలు నిండాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కొమురవెల్లి మల్లన్నసాగర్‌ 536 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉండే కీలకమైన రిజర్వాయర్‌లోకి నీటిని తరలిస్తారు. దీని కింద 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. ఇప్పటికే 65 శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. తుక్కాపూ ర్‌ పంప్‌హౌస్‌ నుంచి ప్రధాన కెనాల్‌ ద్వారా అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌస్‌ ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తారు.మరో వైపు ప్యాకేజీ-17 ద్వారా నిర్మించే కాల్వ నుంచి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు, ప్యాకేజీ-18 కింద నిర్మించే కాల్వ ద్వారా నీటిని హల్దీవాగుకు పంపిస్తారు. ప్యాకేజీ-19 ద్వారా చేబర్తి గ్రామం వరకు గోదావరి జలాలు తరలించడంతో హల్దీవాగు నుంచి నిజాంసాగర్‌కు జీవం పోస్తారు.సిద్దిపేట జిల్లా నలుదిక్కులా రిజర్వాయర్లు ఉన్నాయి.

 

 

 

రాజన్నసిరిసిల్ల- సిద్దిపేట జిల్లాల సరిహద్దులో అన్నపూర్ణ రిజర్వాయర్‌ను 3.50 టీఎంసీల సామర్థ్యంతో, చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ వద్ద శ్రీరంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను 3 టీఎంసీలతో నిర్మించారు. ఈ రెండు రిజర్వాయర్లకు గత నెల నుంచి గోదావరి జలాలు రావడంతో నిండుకుండలా మారాయి. ఇక్కడి నుంచి ప్రధాన కాల్వల ద్వారా గోదావరి జలాలను చెరువులు, కుంటులు, చెక్‌డ్యాంలను నింపుతున్నారు. మండు టెండలో గోదావరి జలాలతో చెరువులు మత్తళ్లు దుంకుతుడటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిణి అయిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 65శాతానికి పైగా పనులు పూర్తి చేశారు.వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా పనులు ము మ్మరంగా నడుస్తున్నాయి. రంగనాయకసాగర్‌ నుంచి మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌ నుంచి కొండపోచమ్మ ప్రధాన కాల్వ ద్వారా అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌస్‌లకు గోదావరి జలాలు చే రాయి.

 

 

 

రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి సీఎం కేసీఆర్‌ గోదావరి జలాలు విడుదల చేశారు. దీంతో మూడు రిజర్వాయర్లు జలకళను సంతరించుకొని ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు అలుగుపారనున్నాయి. ఇక బెజ్జంకి మండలం తోటపల్లిలో తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. రాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి ప్రధానకుడి కాల్వ ద్వారా సుమారుగా 35 కిలో మీటర్ల దూరంలోని తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చి చేరుతున్నాయి.ఈ రిజర్వాయర్‌ ద్వారా గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను నింపుతారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు  చివరిదశలో ఉన్నాయి.

 

 

 

 

ఇక్కడి నుంచి గండిపెల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్‌ చేస్తారు. జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం ఐనాపూ ర్‌-తపాస్‌పల్లి గ్రామాల శివారుల మధ్య తపాస్‌పల్లి(0.50టీఎంసీలు) రిజర్వాయర్‌ను  నిర్మించారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, కొం డపాక, సిద్దిపేట మండలాల్లోని చెరువులు నింపుతున్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా మల్లన్నచెరువును పూర్తిస్థాయిలో యేటా నింపుతున్నారు. వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు నీటి సమస్య తీరుతున్నది.

కౌలు రైతుకు దారేది 

Tags: Mahadasha for the joint Medak district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *