ప్రజా విముక్తి కోసమే మహాకూటమి

Mahakuthami is for public liberation

Mahakuthami is for public liberation

Date:08/10/2018
జగిత్యాల ముచ్చట్లు:
కేసీఆర్ కటుంబ కబంధహస్తాలనుండి రాష్ట్రాన్ని రక్షించేందుకే మహకూటమి. ఈ మహాకూటమి కేసీఆర్ కుటుంబానికి కాలకూట విషమేనని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. సోమవారం జగిత్యాలలో మహాకూటమీ సమావేశం జరిగింది. తరువాత రమణ మీడియాతో మాట్లాడారు. ఒక మాజీ మహిళ మంత్రి  బండారం బయట పెడతానన్న కేసీఆర్ నీ కూతురు గురించి అదేమాటంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కుంటుంబంనుంచి తెలంగాణ ప్రజల్ని విముక్తి కలిగించేందుకే మహాకూటమని అన్నారు. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ పథకాలు పెట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపాడు. ఆనాడు జేఏసీలో ఉన్న అన్ని పార్టీలు మహా కూటమిలో  ఉన్నారు. స్వార్దంతోనే కేసీఆర్ అందరినీ దూరం చేసుకుని కుటుంబ పాలనకు తెరతీశారని విమర్శించారు.
Tags: Mahakuthami is for public liberation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *