భక్తులతో కిక్కిరిసిన మహనంది
నంద్యాల ముచ్చట్లు:
కార్తీక మాసం రెండవ సోమవారము భక్తజనంతో కిటకిటలాడుతున్న శ్రీ మహానందిశ్వర స్వామి వారి దేవస్థానం తెల్లవారుజామున నుండి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని స్వామి వారి రుద్రాభిషేకములను కేదారేశ్వర స్వామి నోములను నిర్వహించుకొన్నారు. ఇ రోజు పున్నమి గడియలు ఉన్నందున భక్తులు నోములు నోచుకోవడం కోసం బారులు తీరారు. రేపు చంద్ర గ్రహణం కారణంగా ఆలయం మూసి వేస్తామని ఈఓ కాపు చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు , భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీ కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు,
Tags: Mahanandi is crowded with devotees

