“మహానటి” టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల 

"Mahanati" teaser and fame Suresh first look released"Mahanati" teaser and fame Suresh first look released

"Mahanati" teaser and fame Suresh first look released

Date:16/04/2018
 హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెలుగు చలన చిత్ర చరిత్రలో సావిత్రి గారి స్థానం అమరం. అటువంటి అసమాన మహానటి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `మహానటి`.  వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత. మహానటి టీజర్ మరియు ఫస్ట్ లుక్ నేడు విడుదల చేసారు చిత్ర బృందం. కీర్తి సురేష్ ఆహార్యం మొదలుకొని హావభావాలన్నీ అచ్చం సావిత్రిగారిలా ఉండటం విశేషం. టీజర్ లో ఎన్నో మధుర క్షణాలు నిక్షిప్తమై ఉన్నాయి. అలనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా అందంగా తెరకెక్కించారని టీజర్ చెప్పగనే చెబుతుంది. టీజర్ చూస్తుంటే నాగ్ అశ్విన్ ప్రేక్షకులను తెలుగు చిత్ర స్వర్ణ యుగంలోకి తీసుకెళ్లడం ఖాయం అని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన సమంత, విజయ్ దేవరకొండల ఫస్ట్ లుక్స్ మరియు మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దుల్కర్ సల్మాన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న “మహానటి” చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్
Tags:”Mahanati” teaser and fame Suresh first look released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *