మహనీయుల త్యాగాలు మరువలేనివి

మదనపల్లె ముచ్చట్లు:

ఆజాది కా అమృత్ మహోత్సవ్ 75 భారతదేశ స్వాతంత్ర స్వర్ణోత్సవాల ర్యాలీని మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మదనపల్లె టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ మురళీకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు హక్కులతో కూడా బాధ్యతలు గుర్తుండాలని మహనీయుల త్యాగాలను మరువకుండా వారి స్ఫూర్తితో మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి గారు మాట్లాడుతూ నాటి మహనీయుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్రం అని వారి యొక్క త్యాగాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలియజేశారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో. విద్యార్థినులుసత్యమేవ జయతే స్వరాజ్యం మా జన్మ హక్కు వందేమాతరం ఆనాటి స్వాతంత్ర నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీమతి మోహన వల్లి అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags: Mahaney’s sacrifices are unforgettable

Leave A Reply

Your email address will not be published.