Natyam ad

మహారాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ముంబై  ముచ్చట్లు:


మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇంట్లో చొరబడి భారీ మొత్తంలో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అడిషనల్ ఎస్పీ అనురాగ్ జైన్‌ తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర లాతూరులోని కన్హయ్యనగర్‌ కాట్పూర్‌ రోడ్డులో రాజ్‌కుమార్‌ అగర్వాల్‌ వ్యాపారి ఇంట్లో ఈ నెల 12న భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఇంట్లోకి ఆయుధాలతో పిస్తోల్‌, పదునైన ఆయుధాలతో నలుగురు దుండగులు చొరబడ్డారు. అనంతరం ఆయుధాలతో వ్యాపారి కుటుంబ సభ్యులను బెదిరించి రూ.2.25 కోట్ల నగదు, 2.4 కిలోల బంగారం దోచుకెళ్లారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు నాందేడ్‌, పర్భని జిల్లాల్లో గాలించేందుకు వివేకానంద పోలీస్‌ స్టేషన్‌ పోలీస్‌ బృందాలతో పాటు క్రైం బ్రాంచ్‌, సైబర్‌ సెల్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ సంయుక్తంగా పనిచేశాయి. ఈ క్రమంలో పుణె, జల్నా, లాతూర్‌లలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ అనురాగ్ జైన్‌ మీడియాకు వెల్లడించారు.

 

Tags: Maharashtrian band of robbers arrested

Post Midle
Post Midle