టిడిపి ప్రభుత్వంలో రైతులకు మహర్దశ

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలం స్పష్టం. నారాయణవనం లో రైతులకు ప్రకృతి వ్యవసాయ పనిముట్లు పంపిణీ.తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో అన్నదాతలకు మహర్దశ కలుగనున్నట్లు ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలం  స్పష్టం చేశారు.మంగళవారం ఉదయం 10 గంటలకు నారాయణవనం ఎంపీడీఓ కార్యాలయం లో PMAJAY పథకం ద్వారా షెడ్యూలు కులాలకు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయ పనిముట్లైన డ్రమ్ములు, టార్ఫాలిన్ పట్టల ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలం  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయనాలు రహిత ప్రకృతి సేద్యం మానవాళికి, భూమికి ఎంతో శ్రేయస్కరం అన్నారు.చంద్రన్న ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లో భాగంగా పేద షెడ్యూల్ కులాల రైతులకు డ్రమ్ములు, టార్ఫాలిన్ పట్టాలు పంపిణీ చేస్తుందన్నారు.ప్రకృతి పద్ధతిలో వ్యవసాయానికి అవసరమైన ద్రవ,ఘన జీవామృతాలు తయారీకి డ్రమ్ములు, టార్ఫాలిన్ పట్టాలు ఉపయోగపడుతుందన్నారు.అనంతరం రైతులకు డ్రమ్ములు, టార్ఫాలిన్ పట్టాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ చేతులు మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 

Tags:Mahardasa for farmers under TDP government

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *