రోడ్లకు మహర్దశ

అమరావతి ముచ్చట్లు:

2,500 కోట్లతో ,8 వేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్ల మెయింటెనెన్స్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.800 కోట్ల బిల్లులు చెల్లించారు.‘నిడా’ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌) ద్వారా రూ.1,158 కోట్లు వెచ్చించి 720 కి.మీ. రహదారులను వెడల్పు చేస్తున్నారు .ఇప్పటికే రూ.700 కోట్లు బిల్లులు చెల్లించారు జూన్‌ నాటికి ఈ పనులు పూర్తి అవుతాయి ).మే నెలలో,సుమారు రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహాయంతో మండల కేంద్రాల నుంచి ఉమ్మడి జిల్ల కేంద్రాలకు రోడ్లు వెడల్పు పనులు.రెండో విడత పనులు డిసెంబరులో మొదలవుతాయి)మే నెలలో రూ.1,017 కోట్లతో సుమారు 5 వేల కిలోమీటర్ల పంచాయితీరాజ్‌ రోడ్ల పనులు.29 వేల కోట్లతో(రూ.29,249 కోట్లు ) జాతీయ రహదారుల కింద 99 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 3,079 కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నారు.మరో 29 వేల కోట్లు వ్యయం తో మరో 45 ప్రాజెక్టుల కింద సుమారు మరో 3 వేల కిలోమీటర్ల పనులు డీపీఆర్‌ దశ దాటాయి.ఇంటర్‌ స్టేట్‌ కనెక్టివిటీ కింద ఆరు ప్రాజెక్టులకుగానూ నాలుగు ప్రాజెక్టుల టెండర్లు పూర్తయ్యాయి.

 

Tags:Mahardasa for roads

Leave A Reply

Your email address will not be published.