పుంగనూరులో సరిహద్దు రోడ్లకు మహర్ధశ
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్నాటక సరిహద్దు లింకు రోడ్లకు మహర్ధశ పట్టింది. సుమారు 30 సంవత్సరాలుగా బండిబాటగా ఉన్న రోడ్డును విస్తరించి, పనులు చేపట్టాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు రోడ్డు పనులు ప్రారంభించారు. గూడూరుపల్లె నుంచి పిచ్చిగుండ్లపల్లె నుంచి పలమనేరు నియోజకవర్గంలోని మాదనపల్లె మీదుగా 2 కిలో మీటర్లతో కర్నాటక రోడ్డుకు అనుసందానం చేయనున్నారు. సుమారు రూ.70 లక్షలతో మట్టిరోడ్డు పనులను చురుగ్గా సాగిస్తున్నారు. దీనిపై కంకర వేసి రోడ్డు ఏర్పాటు చేసి, బీటి వేయనున్నారు. ఈ రోడ్డు పూర్తి కాగానే కర్నాటక ప్రాంత వాసులు నేరుగా చిత్తూరు హైవే ఎంబిటి రోడ్డులో కలిసేందుకు సులభతరంకానుంది. ఈ ప్రాంత వాసులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags; Mahardhasa for border roads in Punganur
