100 కోట్ల క్లబ్ లోకి మహర్షి

Maharshi into the 100 crore club
Date:11/05/2019
హై ద్రాబాద్ ముచ్చట్లు:
తన 25వ సినిమా ‘మహర్షి’తో ప్రిన్స్ మహేశ్‌బాబు బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతున్నాడు. మహేశ్ మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజే రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. రెండోరోజు కూడా ఈ సినిమా చాలాచోట్ల గత రికార్డులను తిరగరాసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లోనూ దుమ్ము లేపుతోంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ కలెక్షన్లు స్పైడర్, ఆగడు సినిమాల కంటే తక్కువ వచ్చినట్లు వార్తలు వచ్చినా ప్రస్తుతం కలెక్షన్లు నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘మహర్షి’ రెండ్రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.32.02కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల కలెక్షన్లు కలుపుకుంటే రెండ్రోజుల షేర్ రూ.40కోట్లకు పైగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. సినిమా బిజినెస్‌తో పోలిస్తే రెండ్రోజుల్లోనే 43శాతం రికవరీ అయినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మహర్షి’ అనేక ప్రాంతాల్లో తొలిరోజు కలెక్షన్లలో రికార్డు నెలకొల్పింది. కేరళలో తొలిరోజు రూ.2.9లక్షలు వసూలు చేసింది. అక్కడ విడుదలైన తెలుగు సినిమాల్లో తొలిరోజు వసూళ్లలో ఇదే రికార్డు అని చెబుతున్నారు. నైజాం, గుంటూరు రీజియన్లలోనూ తొలిరోజు వసూళ్లలో నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Tags: Maharshi into the 100 crore club

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *