Natyam ad

ఉత్తరాయణం తరువాత చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ

– ఆలయ నిర్మాణపనులను పరిశీలించిన జెఈఓ   వీరబ్రహ్మం

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

చెన్నై జిఎన్ చెట్టి రోడ్డులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణపనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తిచేసి ఉత్తరాయణం తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లో మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ఆలయ నిర్మాణ పనులను శనివారం చెన్నై స్థానిక సలహా మండలి, అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ , ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు ఇచ్చామని తెలిపారు. నిర్ణీత వ్యవధిలో ఈ పనులు పూర్తి చేసి మహా సంప్రోక్షణకు సిద్ధం చేస్తామన్నారు. ఈ ఆలయం భక్తులు దర్శించుకునేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అంతకు ముందు జెఈవో టి.నగర్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం , ఆఫీసు , ఇతర గదులు పరిశీలించారు . ఇక్కడ వృధాగా ఉన్న ఫర్నీచర్ , ఇతర వస్తువులు తొలగించాలని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా దిట్టం పెంచుకోవాలని అధికారులకు సూచించారు . ఇక్కడి ఆలయంలో శనివారం నుంచి అర్చన, ఆశీర్వచనం సేవలకు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించామని తెలియజేశారు. తమిళనాడులోని కాంచీపురం, మధురై, వేలూరు, కన్యాకుమారి , చెన్నె లోని ధర్మశాల తదితర ప్రాంతాల్లో టిటిడి కల్యాణ మండపాలు, టిటిడి స్థలాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించి వీటిని మరింతగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయాలని చెప్పారు .

 

 

 

చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు   శేఖర్ రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అదేవిధంగా కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, రాయపేటలో ఉన్న 1.5 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులతో కలిసి తగిన చర్యలు చేపడతామన్నారు.టిటిడి బోర్డు సభ్యులు  శంకర్, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ఇ ఎలక్ట్రికల్  వెంకటేశ్వర్లు, ఎస్ఇ-3  సత్యనారాయణ, ఇఇ  మనోహర్, డెప్యూటీ ఈవో విజయకుమార్ పాల్గొన్నారు.

 

Tags: Mahasamprokshan of Sri Padmavati Ammavari Temple in Chennai after Uttarayanam

Post Midle

Leave A Reply

Your email address will not be published.