శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మహాశాంతి తిరుమంజనం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధన, పంచగవ్యారాధన నిర్వహించారు. ఉదయం జలవాసం, బింబస్థాపన చేపట్టారు.సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు ఏపి.శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ రవికుమార్, సూపరింటెండెంట్లు మోహన్ రావు, నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనంజయులు, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Tags:Mahashanthi Thirumanjanam at Sri Govindaraja Swamy Temple
