మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
– సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సమావేశం
శ్రీశైలం ముచ్చట్లు:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సమావేశం మంగళవారం జరిగింది. ధర్మ కర్తల మండలి సభ్యులు శ్రీమఠం విరూపాక్షయ్యస్వామి, ఎం విజయలక్ష్మి ఓ. మధుసూదన్ రెడ్డి సంబంధిత విభాగాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి పేరొందిన కళాకారులచేత కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.
వర్ధమాన కళాకారుల కార్యక్రమాలు, ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, హరికథలు, భజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈసమావేశంలో శ్రీశైలప్రభ సంపాదకులు డా. సి. అనిల్ కుమార్,పర్యవేక్షకులు పి.దేవిక, సంబంధిత గుమాస్తా ఎన్. అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Tags: Mahashivratri Brahmotsavams
