ముక్కంటి క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

-శివనామ స్మరణతో మార్మోగిన దక్షిణ కైలాసం

Date:21/02/2020

శ్రీకాళహస్తి  ముచ్చట్లు:

చిత్తూరుజిల్లా  శ్రీకాళహస్తి లోని ముక్కంటి నిలయం కాళహస్తీశ్వర్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి.  శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలోని

వాయులింగేశ్వరుడు నిత్యాభిషేక మూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలతోపాటు ఉచ్చికాలాభిషేకం, నీర్వహించారు.  వేకువజామున రెండు

గంటల నుంచే దక్షిణ కైలాసం శివనామ స్మరణతో మార్మోగింది. ఈ ఏడాది నూతనంగా రాజగోపురం సమీపం నుంచి సామాన్య భక్తుల కోసం ఉచిత దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఆలయం లోపల మహాలఘుదర్శనం కల్పించారు. ప్రత్యేక దర్శన టిక్కెట్టు కొనుగోలు చేసిన వారిని దక్షిణ గోపురం వైపు నుంచి అనుమతించారు. కంచుగడప వద్ద కూడా ఉచిత క్యూలైను,

ప్రత్యేక దర్శనం క్యూలైను కలవకుండా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి సమస్య రాకుండా భక్తులు సులభంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్గింది.

దర్శనానంతరం భక్తులు ఆలయం వెలుపలకు రావడానికి స్పటికలింగం వద్ద ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయడంతో మహద్వారం వద్ద రద్దీ తగ్గింది.

రాజకీయాలకు దూరంగా ఆదినారయణరెడ్డి

Tags: Mahasivarathri celebrations at the grandeur of the piece

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *