తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకం

Mahendra Singh Dhoni's half century in the first ODI

Mahendra Singh Dhoni's half century in the first ODI

Date:12/01/2019
సిడ్ని ముచ్చట్లు:
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకంతో మెరిశాడు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో.. నాలుగో ఓవర్లోనే క్రీజ్‌లోకి అడుగుపెట్టిన మహీ.. రోహిత్ శర్మతో కలిసి ఓపికగా ఆడాడు. 93 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ధోనీ.. 68వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహీ కెరీర్లో నెమ్మదిగా చేసిన రెండో అర్ధ శతకం ఇదే కావడం గమనార్హం. గత ఏడాది ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని మహీ.. ఈ ఏడాది తొలి ఆడిన తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. 14 ఇన్నింగ్స్ విరామం తర్వాత ధోనీకి ఇది తొలి అర్ధ శతకం. ఆచితూచి ఆడిన ధోనీ.. రోహిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. పది పరుగుల్లోపు మూడు వికెట్లు కోల్పోయాక.. నాలుగో వికెట్‌కు నమోదైన రెండో అతిపెద్ద భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం. 1984లో ఆస్ట్రేలియా విండీస్‌పై 150 పరుగులు చేయడమే ఇప్పటి వరకూ అత్యుత్తమం. భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో బెహ్రెన్‌డ్రాఫ్ బౌలింగ్‌లో ధోనీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి అవుట్ సైడ్ పిచ్ అయినా.. అదేమీ పట్టించుకోకుండానే అంపైర్ మైకెల్ గవుఫ్ అవుటిచ్చాడు. టీమిండియా అప్పటికే రెండు రివ్యూలను వృథా చేయడంతో.. మరోసారి డీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోయింది. దీంతో భారత్ కీలకమైన ధోనీ వికెట్ కోల్పోయింది. డీఆర్ఎస్ కోరడంలో కింగ్ అయిన ధోనీ.. నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది
Tags:Mahendra Singh Dhoni’s half century in the first ODI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *