లబ్ధిదారులకు వైయస్సార్ చేయూత  ఫారాలను అందజేసిన చేజర్ల మహేష్

Date:13/08/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని 21 వ డివిజన్ పరిధిలోని 4 సచివాలయాలలో  వైయస్సార్ చేయూత లబ్ధిదారులకు ఫామ్ లను స్థానిక డివిజన్ ఇంచార్జి చేజర్ల మహేష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఇంత మంది లబ్ధిదారులకు వైయస్సార్ చేయూత రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఇంతమంది లబ్ధిదారులకు ఈ పథకం రావడానికి కారణమైన   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి,  వారి సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని  ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నిరు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా  జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని  వైఎస్ జగన్మోహన్రెడ్డి సేవలను కొనియాడారు .ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు దిలీప్ రెడ్డి, రాజశేఖర్ మరియు సచివాలయ అడ్మిన్లు, వెల్ఫేర్ సెక్రటరీలు మరియు వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు.

గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం

Tags: Mahesh, Chaser, handed over the forms to the beneficiaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *