కత్తి మహేష్ మృతి

చెన్నై ముచ్చట్లు:

 

నటుడు,ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కన్ను మూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కత్తి మహేష్ మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్…. జూన్ 26 న తెల్లవారుఝూమున ఆయన ప్రయాణిస్తున్న వాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో మహేశ్‌ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా… తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం  చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.  కత్తి మహేష్ కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధినుంచి రూ. 17లక్షల రూపాయలు అందజేసింది..

 

Tags: Mahesh killed by sword

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *