సీఎం పర్యటన నిమిత్తం A.S.L(అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్) నిర్వహణ.
– ఆసాదరణమైన పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
– ఈనెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్నారు.
– ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రతపై రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., మరియు జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణ రెడ్డి ఐఎఎస్.

తిరుపతి ముచ్చట్లు:
ఈనెల 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటన నేపథ్యంలో ఆదివారం నాడు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు భద్రత పరమైన ముందస్తు ఏర్పాట్లపై (ASL) ను జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపియస్., జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి ఐఎఎస్., వారు ఇతర శాఖల అధికారులతో రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు సమీక్ష నిర్వహించి భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో డేగ కన్ను లాంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ప్రారంభం అయి తిరుగు ప్రయాణం అయ్యే వరకూ ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి బద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులకు కూడా కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయపరచుకుంటూ ప్రణాళికా బద్దంగా, సమిష్టిగా ముందుకు వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయుటకు విశేష కృషి చేస్తామని అన్నారు.
సూళ్లూరుపేట లోని బహిరంగ సభా ప్రాంగణం, హెలిపాడ్ మరియు వాటిని అనుసంధానించే రోడ్ మ్యాప్ ప్రాంతాల వద్ద బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులతో జల్లెడ పడుతున్నాము. ఈ ప్రక్రియ ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యేంతవరకు నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక మైన కార్యాచరణతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి ఐఏఎస్., మాట్లాడుతూ బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీసులకు సూచనలు చేశారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జేసీ బాలాజీ ఐఏఎస్., అదనపు ఎస్పీలు వెంకటరావు పరిపాలన, కులశేఖర్ శాంతి బద్రత, డీఎస్పీలు గిరిధర ఎస్బీ, చంద్రశేఖర్ డి.ఎస్.డబ్ల్యు, ఎయిర్ పోర్టు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.ఆలాగే సభా ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే లు కే.సంజీవయ్య .,డా.వరప్రసాద్ .,తదితరులు పాల్గొన్నారు.
Tags:Maintenance of A.S.L (Advance Security Licence) for CM visit.
