విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాలి

Make a calm environment for the studentsMake a calm environment for the students

Make a calm environment for the students

– ఎంఈవో హేమలత చే పాఠశాలల తనిఖీ

Date:22/10/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండల కేంద్రంలోని పలు పాఠశాలలను ఎంఈవో హేమలత సోమవారం తనిఖీ చేశారు. పంజాణి సత్రం, బసవరాజా కండ్రిగ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోను విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలను బోధించాలని తెలిపారు. మధ్యాహన భోజన పథకం అమలును పరిశీలించారు. ఆహార నాణ్యత, సరఫరా విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బుధవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీ నాగరాజు పాల్గొన్నారు.

వేడెక్కుతున్న కోస్తా...

Tags:Make a calm environment for the students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *