Natyam ad

పుంగనూరులో  20లోపు సహకార బంధు చేసుకోండి-చీఫ్‌మేనేజర్‌ రాధారాణి

పుంగనూరు ముచ్చట్లు:

 

డీసీసీబ్యాంకులో సహకార బంధు పథకాన్ని ఈనెల 20తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు చీఫ్‌మేనేజర్‌ రాధారాణి తెలిపారు. శుక్రవారం ఆమె ఈమేరకు సహకార బంధు కరపత్రాలను పంపిణీ చేశారు. చీఫ్‌మేనేజర్‌ మాట్లాడుతూ సీఈవో మనోహర్‌గౌడ్‌, డీసీసీబి చైర్మన్‌ రెడ్డెమ్మల ఆధ్వర్యంలో బ్యాంకు ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే డిపాజిట్లు రూ.1000 ల నుంచి స్వీకరిస్తామన్నారు. డిపాజిట్‌ దారులకు ఇన్సూరెన్స్ రక్షణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే ఆస్తుల తాకట్టు రుణాలు విరివిగా మంజూరు చేస్తున్నామన్నారు. రైతులు , వ్యాపారులు, వృద్ధులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా రుణాలు తీసుకున్న వారు సకాలంలో బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ నాగప్రసాద్‌ , సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Make a co-operative brother under 20 in Punganur-Chief Manager Radharani

 

Post Midle