వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి:మల్లెపల్లి ప్రభాకర్

మహబూబ్ నగర్ ముచ్చట్లు:
 
వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అమలు కోసం సమగ్ర చట్టం చేయాలని సిపిఐ (ఎంఎల్) క్రాంతి జాతీయ కార్యదర్శి మల్లెపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా రైతు కూలీ సంఘం విస్తృతస్థాయి సదస్సు నేడు మహబూబ్ నగర్ లో జారింది.ఈ సదస్సులో  ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం మాట తప్పడంతో సంయుక్త కిసాన్ నేతృత్వం లో  దేశవ్యాప్తంగా ఈనెల 31న  జరిగే బీజేపీ విద్రోహ దినం ఈ కార్యక్రమంలో లో వేలాది మంది  కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 23 ,24 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించే కార్మిక సమ్మెకు కుడా  వ్యవసాయ కార్మికులు మద్దతు ప్రకటించాలన్నారు. దేశంలోని పెట్టుబడి దారులు 10 కుటుంబాలు 10 లక్షల కోట్ల కొత్తగా సమకూర్చుకున్నారని,కాని 50 కోట్ల మంది ఆస్తులు తగ్గిపోయావన్నారు. కోవిల్ సహాయం పేరుతో మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు దోచి పెట్టిందన్నారు. మూడు వ్యవసాయ నల్ల  చట్టాలను రద్దు చేస్తూ రైతులకు మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటికీ చేయలేదన్నారు పంటలకు కనీస ధర కోసం చట్టం చేస్తామని,విద్యుత్ బిల్లులు ఉపసంహరించుకుంటామని రైతాంగ ఉద్యమంలో అమరులైన ఏడు వందల మంది రైతు కుటుంబాలకు ఆదుకుంటామని కేసు ఎత్తివేస్తామని బాధితులకు న్యాయం చేస్తామని లకంపూర్  బాధితులకు న్యాయం చేస్తామని చేసిన వాగ్దానాలు రెండు నెలలైనా అమలు కాలేదని, మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోరు మెదపకపోవడం శోచనీయం అన్నారు. బడా కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించేందుకు వ్యవసాయ కార్మికులు రైతులు సంఘటిత ఉద్యమాలు సిద్ధం కావాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యాదన్న, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రియాజ్, మహిళా సంఘం అధ్యక్షులు సంపంగి పద్మక్క  తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; Make a comprehensive law for agricultural workers: Mallepally Prabhakar

Leave A Reply

Your email address will not be published.