27లోపు రేషన్‌కార్డుల జాబితపై అభ్యంతరాలు తెలపండి

Date:25/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

బియ్యంకార్డుల లబ్ధిదారుల జాబితాలను విడుదల చేశామని, వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 27 లోపు తెలపాలని తహశీల్ధార్‌ వెంకట్రాయులు కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటి, మండలంలో కార్డులను పరిశీలించడం జరిగిందన్నారు. లబ్ధిదారులు ఇతర జిల్లాలకు వలసలు వెళ్లినా, తదితర విషయాలు గూర్చి పరిశీలించామన్నారు. వీటిపై ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు అభ్యంతరాలను ప్రజలు తెలియజేయాలన్నారు. అలాగే అభ్యంతరాలపై 28న గ్రామసభలు నిర్వహించిన , పునర్విచారణ నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా నూతన కార్డులకు ధరఖాస్తు చేసుకోదలచిన వారు తమ సచివాలయాలలలో కుటుంబ సభ్యుల వివరములు, ఆధార్‌కార్డులకు సంబంధించి కాపీలను అందజేస్తే నూతన కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఇతర మండలాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు వారి కార్డుల వివరాలతో సచివాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మతసామరస్యానికి విఘాతం

Tags: Make a list of ration cards under 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *