మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను జయప్రదం చేయండి

Make a visit to the Minister Peddireddy tour

Make a visit to the Minister Peddireddy tour

– పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి , పోకల , కొండవీటి పిలుపు

Date:19/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 21న శుక్రవారం తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు పెద్దిరెడ్డి, పోకల అశోక్‌కుమార్‌, కొండవీటి నాగభూషణం, విశ్వనాథ్‌, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ నరసింహులు కలసి బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోకల అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి హ్గదాలో తొలిసారిగా వస్తున్న మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. మంత్రి బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా పట్టణంలోని హనుమంతరాయుదిన్నె ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని, అక్కడ పూజలు చేసి, పర్యటన ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.అక్కడి నుంచి నేరుగా రోడ్‌షో నిర్వహిస్తూ బిఎంఎస్‌క్లబ్‌లో ప్రజలు, నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి చౌడేపల్లె మీదుగా నియోజకవర్గం అంతా పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనను జయప్రదం చేసేందుకు ప్రజలు, పార్టీ అభిమానులు, ప్రజాప్రతినిధులు, పెద్దిరెడ్డి అబిమానులు ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మికసంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్‌, కో-ఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌బాషా, పార్టీ నేతలు విజయభాస్కర్‌రెడ్డి , తుంగామంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో 

Tags; Make a visit to the Minister Peddireddy tour

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *