ఐటిఐలో ప్రవేశానికి ధరఖాస్తు చేయండి

Date:13/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద గల ప్రభుత్వ ఐటిఐలో అడ్మీషన్ల కోసం పదోతరగతి చదివిన విద్యార్థులు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్‌ సుబ్రమణ్యంరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వాదేశాల మేరకు రెండవ విడత అడ్మీషన్లను 14 నుంచి స్వీకరిస్తామన్నారు. పదోతరగతి పాసైన యువతి, యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ.10 లు ధరఖాస్తు రుసుము చెల్లించి, అడ్మీషన్లు పొందాలని కోరారు. ఈనెల 24 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఈనెల 27న ఉదయం 9:30 గంటల నుంచి నిర్వహిస్తామని, ఇంటర్వ్యూలకు హాజరైయ్యే అభ్యర్థులు తమ ఒరిజనల్‌ సర్టిపికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

మదనపల్లె మున్సిపల్‌ కమిషనర్‌గా కెఎల్‌.వర్మ

Tags: Make admission to ITI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *