18న అసెంబ్లి ముట్టడిని జయప్రదం చేయండి

Make an assassination of the Assembly on 18th

Make an assassination of the Assembly on 18th

Date:16/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపిఎస్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండు చేస్తూ ఈనెల 18న ఛలో అసెంబ్లి ముట్టడిని జయప్రదం చేయాలని ఎస్టీయు జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేంద్రబాబు కోరారు. ఆదివారం పట్టణంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేసి, ఓపిఎస్‌ను అమలు పరచేలా ఉపాధ్యాయులందరు అసెంబ్లిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులకు సిపిఎస్‌ ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప్రభుత్వం అప్పటికి స్పందిచకపోతే ఆందోళనలు ఉధృతం చేసి, ఉద్యోగుల ఐకమత్యంతో సిపిఎస్‌ను అంతం చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వానికి పోరాటాలతోనే కళ్ళు తెరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి యాదవ్‌ తో పాటు స్థానిక ఉపాధ్యాయు నేతలు మోహన్‌, రెడ్డెప్ప, నారాయణ, మురళి,

 

అయూబ్‌ఖాన్‌, శంకర్‌, గురుప్రసాద్‌, మణి, శరత్‌, కుమార్‌, నరేంద్ర, జమీర్‌బాషా, దీపారాణి, శ్రీలేఖ , పూజిత, వెంకటరమణారెడ్డి, క్రిష్ణమూర్తి, రెడ్డెప్ప, చంద్రశేఖర్‌రెడ్డి , మహమ్మద్‌రఫి, బాలరాజు, సుబ్రమణ్యం , నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం

Tags; Make an assassination of the Assembly on 18th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *