Natyam ad

ఆలయాల కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేయండి- టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం

తిరుపతి ముచ్చట్లు:

 

జమ్ము, చెన్నై, రంపచోడవరం, సీతంపేట ల్లో టీటీడీ నిర్మించిన ఆలయాల కుంభాభిషేకాలు వచ్చే ఏడాది మార్చి నుంచి మే లోగా ఉంటాయని టీటీడీ జేఈవో   వీరబ్రహ్మం తెలిపారు. సంబంధిత అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
టీటీడీ పరిపాలన భవనం లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన ఇంజినీరింగ్, ఆలయాల డిప్యూటీ ఈవో లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, నిర్మాణం పూర్తి అయిన ఆలయాల కుంభాభిషేకానికి ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలన్నీ పంపాలని సూచించారు. కుంభాభిషేకంకు ఏవైనా ఇబ్బందులు ఉంటే స్థానిక అధికారులను సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన చెప్పారు. జమ్ము ఆలయానికి సంబంధించి వాటర్ పైప్ లైన్ నిర్మాణం, గార్డెనింగ్ పనుల్లో వేగం పెంచాలని జేఈవో సూచించారు. సెక్యూరిటీ, శ్రీవారి సేవకుల ఏర్పాటుకు సబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ఆవరణంలో బ్యాంకు శాఖ ఏర్పాటు విషయం పరిశీలించాలన్నారు.

 

 

డిప్యూటీ ఈవోలు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఆలయాలను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. డిప్యూటీ ఈవోలు తమ పరిధిలో ఉన్న టీటీడీ విలీన ఆలయాలను తరచూ సందర్శించి అక్కడి పరిస్థితులు, సమస్యలపై తనకు నివేదికలు ఇవ్వాలన్నారు. చెన్నై సమాచార కేంద్రంలోని ఆలయంలో సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సంఖ్యను బట్టి ఆలయాల్లో దిట్టం అంశం సమీక్షించాలని ఆయన సూచించారు. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం అభివృద్ధి పనుల పురోగతిపై చర్యలు తీసుకోవాలని ఆయన సిఈ ని ఆదేశించారు.చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ఈ సత్యనారాయణ, రవాణా విభాగం జి ఎం  శేషారెడ్డి, డిఎఫ్వో  శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Make arrangements for Kumbhabhishekam of temples- TTD JEO  Veerabraham

Post Midle