ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా! – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

– మీ గడపగడపకు సర్పంచ్ అంటూ ప్రజలతో మమేకం..
– సమస్యల పరిష్కార దిశగా అడుగులు…
– వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..

రామసముద్రం, ముచ్చట్లు:

మండలంలోని కెసిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశాల మేరకు సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి మీ ఇంటి వద్దకే… మీ సర్పంచ్ అంటూ నూతన కార్యక్రమానికి సోమవారం, మంగళవారం రెండు రోజులు గుంతయంబాడి, వై.కురప్పల్లి, వనగానిపల్లి, జోగిండ్లు, మిట్టయంబాడి, కెసిపల్లి గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి  పారిశుద్ధ్యం, మంచినీరు, పంచాయతీ సిబ్బంది పని తీరును ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అక్కడే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల ముంగిటకే పాలన అంటూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలింటర్లు ద్వారా ప్రభుత్వ పథకాలను సకాలంలో అందజేస్తున్నారన్నారు. పంచాయతీ పరిధిలోని ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటూ ఇలా ప్రతిరోజు ప్రజలతో మమేకం అవ్వడం జరుగుతుందని సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గ్రామాల్లో పర్యటించి గుర్తించిన సమస్యలను ఎప్పటికప్పుడు శాసనసభ్యులు నవాజ్ బాషా సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీనీ రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా  తీసుకుని వెళ్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. గ్రామాల్లో కూడా ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది ఉపేంద్ర, రవి, ఏఎన్ఎమ్ సుగుణమ్మ, లైన్ మాన్ రాంబాబు, విఆర్ఏ మహ్మద్ రఫీ, ఫిల్డ్ అసిస్టెంట్ వెంకటరమణ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, నాగరాజ, జయచంద్ర, సంఘమిత్రలు మమత, హరిత, వాలింటర్లు మేఘన, రెడ్డెమ్మ, శ్రావణి, పుష్పావతి, దినకర్, హరీష్, కుమారస్వామి, ప్రదీప్, రామచంద్ర, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, హరితరాయబారులు రెడ్డెప్ప, ఆంజప్ప, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: Make it an ideal gram panchayat!- Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.