Natyam ad

పుంగనూరులో ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని గెలిపించండి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు పలు ప్రాంతాలలో ప్రచారాలు తీవ్రం చేశారు. గురువారం పట్టణంలోని బజారువీధిలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా , రాయలసీమ జిల్లాల వాణిజ్య విభాగం ఇన్‌చార్జ్ వెంకటేష్‌, కౌన్సిలర్‌ రేష్మా ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ సాజిదాబేగం ఆధ్వర్యంలో రహమత్‌నగర్‌, యూబికాంపౌండులో ప్రచారం చేశారు. అలాగే ప్యాలెస్‌ కాంపౌండులో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కొత్తపేటలో కౌన్సిలర్‌ భారతి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయకృష్ణ, ఎన్‌ఎస్‌.పేటలో కౌన్సిలర్‌ రాఘవేంద్ర, మంగళం కాలనీలో కౌన్సిలర్‌ నరసింహులు ప్రచారాలు నిర్వహించారు. ఈ ప్రచారాలలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, పిఎల్‌.శ్రీధర్‌, సురేష్‌, రవి, భానుప్రకాష్‌, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; Make MLC candidate Shyam Prasad Reddy win in Punganur

Post Midle