Natyam ad

పోలీసు అమర వీరుల వారోత్సవాలు విజయవంతం చేయండి  

-ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన జిల్లా పోలీసుశాఖ

కడప ముచ్చట్లు:


ప్రతీ ఏటా పోలీసు అమరులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీసు అమర వీరుల వారోత్సవాలు ఈనెల 21 నుండి ప్రారంభం కానున్నాయి.అమర పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేలా జిల్లా పోలీసుశాఖ సిద్ధమయ్యింది. జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్  పర్యవేక్షణలో ఈనెల 21 వ తేదీ నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధుల్లో ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు.విధి నిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసుల్ని గుర్తు చేసుకోవడంతో పాటు సమాజంలో కీలకమైన పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలు గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యం.
1959వ సంవత్సరం, అక్టోబర్ 21వ తేదీన దేశ భద్రత కోసం 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్‌లు భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడక్ ఆక్చాయ్‌చిన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు.భారీ సంఖ్యలో చైనా సైనికులు భారత్ సరిహద్దుల్లోకి చొరబడి ఒక్కసారిగా మన సీఆర్‌పీఎఫ్ జవాన్‌లపై విరుచుకుపడ్డారు. సంఖ్యా బలం తక్కువుగా ఉన్నప్పటికీ భారత్ జవాన్‌లు ఆత్మస్థెర్యంతో చైనా సైనికులను ఎదురిస్తూ, చివరి రక్తం బొట్టు వరకు పోరాడారు. దేశం కోసం అసువులు బాశారు.ఈ ఘటన పురస్కరించుకుని ప్రతీ ఏటా అక్టోబర్ 21వ తేదీ పోలీసుల అమర వీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు.జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలు

 

Post Midle

ఈనెల 21 న స్థానిక పోలీసు అమర వీరుల స్థూపం వద్ద జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్  ఆధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించనున్నారు.
మావోయిస్టులు, ఉగ్రవాదులు, తదితర అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా  మరియు కరోనా నియంత్రణలో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించనున్నారు.కడప నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో స్మృతి పరేడ్ నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
ఈనెల 22 నుండి 30 వరకు పోలీసు అమరుల గ్రామాల సందర్శన… అమరుల సేవలను వివరించడంఈనెల 22 నుండి 30 వ తేదీ వరకు పోలీసు పోలీసు అమరుల గ్రామాలు/పట్టణాలు సందర్శించనున్నారు. వారు చదివిన పాఠశాలలకు వెళ్లి అమరుల ఫోటోలు పెట్టుకునేలా సూచించడం
అమరుల ఫోటోలకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం… వారి సేవలను కొనియాడనున్నారు.

 

 

ఈనెల 24 నుండి 27 వరకు చర్చావేదికలు, వక్తృత్వపు పోటీలు
ఈనెల 24 నుండి 27 తేదీ వరకు  ” మారుతున్న కాలంలో పోలీసు పాత్ర”  మహిళా భద్రతలో పోలీసు పాత్ర అంశాలపై  జిల్లావ్యాప్తంగా చర్చావేదికలు, వక్తృత్వపు పోటీలు నిర్వహించనున్నారు.ఈనెల 26 న… పోలీసుల త్యాగాలు, పరాక్రమాలు తెలియజేసే చిత్రాల ప్రదర్శనలుత్యాగం, పరాక్రమాలు కనపరిచే పోలీసు బ్రేవరీస్ చిత్రాలను ఈనెల 26 న జిల్లా వ్యాప్తంగా సినిమా హాళ్లలో మరియు స్థానిక కేబుల్ టి.వి లలో ప్రదర్శింపనున్నారు.
ఈనెల 26 నుండి 27 వరకు ఓపెన్ హౌస్ లు నిర్వహణ ఈనెల 26 నుండి 27 వ తేదీ వరకు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ తో పాటు సబ్ డివిజన్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్ ల స్థాయిలో ఓపెన్ హౌస్ లు నిర్వహించనున్నారు.
పోలీసులు నిత్యం వినియోగించే ఆయుధాలు, సాధనాలు, పరికరాలను ప్రదర్శించి విద్యార్థులు, ప్రజలకు అవగాహన చేయనున్నారు. పోలీసు స్టేషన్ల రికార్డుల నిర్వహణ గురించి తెలియజేయనున్నారు.

 

 

 

ప్రదర్శనలో ఉంచే ఆయుధాలు, పరికరాలు, సాధనాలు ఇవే…
.22 రైఫిల్ , .410 మస్కెట్ , .303 రైఫిల్ , 762 ఎం.ఎం SLR, ఏ.కే 47, 5.56 ఎం.ఎం (ఇన్సాస్ ), 12 బోర్ పంప్ యాక్సన్ గన్ , 9 ఎం.ఎం. కార్బైన్ , .380 రివాల్వర్ , 9 ఎం.ఎం ఫిస్టోల్ , 9 ఎం.ఎం గ్లాక్ , వి.ఎల్ ఫిస్టోల్ , ప్రొజెక్టర్ ఫైరోటెక్ , 12 బోర్ పంప్ యాక్సన్ గన్ , ఎల్ .ఎం.జి, 51 ఎం.ఎం మోటారు, హెచ్ .ఇ 36 గ్రనేడ్ , యాంటీ రైట్ గన్స్ , గ్యాస్ గన్ , రోబోటెక్ ( బాడీ ప్రొటెక్టర్ )  , ఫైబర్ లాఠీ, బాడీ ప్రొటెక్టర్ , స్టోన్ గార్డు, హెల్మెట్ , కేన్ లాఠీ, బుల్లెట్ ప్రూప్ జాకెట్ హెవీ, మీడియం, లైట్ … డే మరియు నైట్ విజన్ బైనాక్యూలర్లు, జి.పి.ఎస్ , మెగాఫోన్ , లెటర్ బాంబు డిటెక్టర్ , ప్యాకెట్ స్కానర్ , డి.ఎస్ .ఎం.డి , పాలిరే యు.వి.లైట్ , క్లూస్ టీం ,ఎల్ హెచ్ ఎం ఎస్ బాడీవర్న్  కెమేరాలు, ఫిన్స్ ( ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్ వర్కింగ్ సిస్టం) , డ్రోన్ కెమేరాలు, డి.ఎఫ్ .ఐ.డి, డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ , వజ్ర, వాటర్ కేనన్ వాహనాలను ప్రదర్శనలో ఉంచనున్నారుపోలీసుల దర్యాప్తుల్లో కీలక భూమిక పోషించే డాగ్ స్క్వాడ్ బృందం విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 28 న వైద్య శిభిరాలు, రక్తదానాలు

 

 

 

జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీసులు తమ పరిధుల్లో ఈనెల 28 న వైద్య శిభిరాలు, రక్తదానాల కార్యక్రమాలు నిర్వహించి సామాజిక సేవను చాటనున్నారు.ఈనెల 28 నుండి 30 వరకు పోలీసు వాయిద్య బృందాల ప్రదర్శనలుఈనెల 28 నుండీ 30 వరకు పోలీసు వాయిద్య బృందాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పోలీసుల త్యాగాలు, పరాక్రమాలు తెలియజేసే  పాటలు ఆలపించనున్నారు.ఈనెల 29 వ తేదీన పోలీసుల త్యాగాలపై సెమినార్లు/ ఉపన్యాసాలు… సాంస్కృతిక కార్యక్రమాలు
విధి నిర్వహణలో పోలీసులు చేస్తున్న త్యాగాలు గురించి ఈనెల 29 వ తేదీన సెమినార్లు/ ఉపన్యాసాలు నిర్వహించనున్నారు.
అంతేకాకుండా సమాజం కోసం పోలీసులు చేస్తున్న సేవలు, విధులు, త్యాగాలు గురించి నాటికలు మరియు పాటల రూపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈనెల 30 న… పోలీసు అమరుల కుటుంబాల్లోని ప్రత్యేక సాధకులకు సన్మానంఈనెల 30 న… పోలీసు అమరుల కుటుంబాల్లోని ప్రత్యేక సాధకులను గుర్తించి వారికి సన్మానం చేయడం, వారి సేవలను ప్రశంసించనున్నారు.
ఈనెల 31 న సమైక్యతా దినం
సమైక్యత భావాన్ని చాటుతూ ప్రజల సహకారంతో ఈనెల 31 న  జిల్లా వ్యాప్తంగా సమైక్యతా దినం పాటించనున్నారు.

 

Tags: Make Police Martyrs Week a success

Post Midle