పుట్టా మధునుంచి రక్షణ కల్పించండి

Make protection from Putta Madhu

Make protection from Putta Madhu

Date:08/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మంధని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు నాకు రక్షణ కల్పించండి అంటూ రమణా రెడ్డి ఆనే వ్యక్తి డిజిపి కి సోమవారం ఫిర్యాదు చేసారు.  2013 లో జరిగిన ఒక తెరాస సభలో  లో కేసీఆర్ ముందు గుండా నాగరాజు  ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ  కేసులో సాక్షం చెప్పొద్దు అంటూ పుట్ట మధు బెదిరిస్తున్నాడని రమణారెడ్డి ఆరోపణ. 2014 ఎన్నికలో మంథని ఎమ్మెల్యే టిక్కెట్ పుట్టా మధుకు ఇవ్వాలంటూ పురుగుల మందు తాగి  నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు ఆత్మహత్య చేసుకోవడానికి 50,000 ఇచ్చి ప్రేరేపించింది పుట్ట మధు అంటూ సాక్షాధారాలు  డిజిపికి రమణారెడ్డి సమర్పించాడు. కాల్ డేటా,   చనిపోయిన నాగరాజు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీస్ ను డిజిపికు అందజేసాడు. నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా పుట్ట మధును నిందితుడిగా చేర్చకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని పిర్యాదు లో పేర్కొన్నాడు.
Tags: Make protection from Putta Madhu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *