విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లుః  మంత్రి గంటా శ్రీనివాస‌రావు

Make sure that the students do not have any difficulties: Minister Banja Srinivasa Rao

Make sure that the students do not have any difficulties: Minister Banja Srinivasa Rao

Date:14/03/2018
అమ‌రావ‌తి ముచ్చట్లు:
ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తులు విద్యార్థుల‌కు క‌ల్పించామ‌ని రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు  తెలిపారు. ఎక్క‌డైనా ఎలాంటి లోటుపాట్లు ఎదురైనా, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినా  స‌ద‌రు అధికారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. బుధ‌వారం ఆయ‌న తుళ్లూరు మండ‌లం మంద‌డం జ‌డ్.పి.హెచ్.సి పాఠ‌శాల ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేశారు.  పరీక్ష కేంద్రంలోని బెంచీలు ఇత‌ర వ‌స‌తుల‌ను త‌నిఖీ చేశారు. ఏ విద్యార్థి నేల‌పై కూర్చొని ప‌రీక్ష రాయ‌డానికి వీల్లేద‌న్న మంత్రి.. అక్క‌డి  వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ‌దుల్లోని  ఫ్లోరింగ్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో దాన్ని బాగు చేయించాల‌ని ఆదేశించారు. అన్ని గ‌దులు తిరిగి వెంటిలేష‌న్, నెంబ‌రింగ్ త‌దిత‌ర అంశాల‌ని ప‌రిశీలించి.. ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ  రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని, మార్చి 29 వరకు జ‌రుగుతాయ‌న్నారు.  ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ వుంటుంద‌ని, అన్ని సెంట‌ర్ల‌లోనూ సెక్ష‌న్ 144ను అమ‌లు చేస్తామ‌న్నారు.  ఉదయం 9 గంటల కల్లా పరీక్ష కేంద్రానికి విద్యార్థులు హాజరుకావాల‌ని… హాల్ టికెట్లు చూయిస్తే ఆర్.టి.సి బ‌స్సుల్లో ఉచిత ర‌వాణా స‌దుపాయం క‌ల్పిస్తార‌న్నారు. మొత్తం 6,17,484 మంది విద్యార్థులు ప‌రీక్‌ాల‌కు హాజ‌రుకానున్న‌ట్లు ఆయ‌న‌ తెలిపారు.  పరీక్షల నిర్వహణకు 156 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామ‌ని, ఫ్ల‌యింగ్ స్వ్కాడ్ ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ వుంటుంద‌న్నారు. ప్ర‌తి జిల్లాల్లోనూ  కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబ‌ర్ ను ఏర్పాటు చేశామ‌న్నారు. న‌గ‌రాల్లో విద్యార్థులు త‌మ త‌మ  సెంట‌ర్ల‌కు  సుల‌భంగా చేరుకునేందుకు సెంట‌ర్ లొకేష‌న్ యాప్ ను రూపొందిచామ‌ని .. దీన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.  సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెం. 18005994550లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛ‌గా ప‌రీక్ష‌లు రాయాల‌ని, వారి త‌ల్లిదండ్రుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని  ఆకాంక్షించిన మంత్రి గంటా…ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థుల‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
విద్యారంగానికి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పెద్ద పీట వేశార‌ని అందుకే ఈ బ‌డ్జెట్ లో 25 వేల కోట్ల‌కు పైగా విద్యారంగానికి కేటాయించ‌డం జ‌రిగింద‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు అన్నారు. న‌వ్యాంధ్ర‌ను నాలెడ్జ్ స్టే ట్ –  ఎడ్యుకేష‌న్ హ‌బ్ గా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని  స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌ల్లో అన్నిర‌కాల మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నామ‌న్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నా బోజ‌న నాణ్య‌త‌ను మంత్రి గంటా ప‌రిశీలించారు. పాఠ‌శాల గదుల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన మంత్రి గంటా… పాఠ‌శాల గ‌దిలో బీరువాలు, ఇత‌ర సామాగ్రి వుండ‌టంతో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల విద్యా క‌మీష‌న‌ర్ సంధ్యారాణి, ఆర్జేడీ, డీఈవో ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
Tags: Make sure that the students do not have any difficulties: Minister Banja Srinivasa Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *