చలో పొద్దుటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
బద్వేలు ముచ్చట్లు:
కడప జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు జరుగుతున్న సిపిఐ కడప జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఏరియా కార్యవర్గ సభ్యుడు పి. వెంకటరమణ గోపవరం మండల కార్యదర్శి జి. పెంచలయ్య పేర్కొన్నారు. మంగళవారం నాడు సిపిఐ గోపవరం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు సెకండ్ కాలనీలో సిపిఐ జిల్లా మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో పెద్దన్నలాంటి సిపిఐ మహాసభలు అతి వైభవంగా, భారీ ప్రదర్శనలతో పొద్దుటూరులో జరగనున్నాయని, మహాసభలలో జిల్లా లో ప్రతి ఒక్క కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ,ఇళ్ల స్థలాలు ,ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సోమశిల వెనుక జలాల ఎత్తిపోతల పథకం తదితర సమస్యల పరిష్కారం కోసం చర్చ జరిపి రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు ముమ్మరం చేస్తామని వారు అన్నారు. కావున మండలంలోని ప్రజలంతా ఊరుకో బండి, ఇంటికోమనిషి కదలివచ్చి మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయక కార్యదర్శి ప్రభాకర్, ప్రజానాట్యమండలి బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ఎస్ చెన్నయ్య, అశోక్ ,దివాకర్ మళ్లీ ,పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: Make the Chalo Podduthuru program Jayaprad
