ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయండి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 30న మదనపల్లెలో నిర్వహించే సభను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరు తరలిరావాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. సోమవారం మండల కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరె డ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో సభను జయప్రదం చేసేందుకు అన్ని గ్రామాల నుంచి వేలాది మంది తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి ,పార్టీ నాయకులు చెంగారెడ్డి, సురేంద్రరెడ్డి, చంద్రారెడ్డియాదవ్, బాలచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: Make the Chief Minister’s House a success – MPP Bhaskar Reddy
