11 వతేదిన జరుగు సమ్మెను జయప్రదం చేయండి

సిఐటియు నాయకుల పిలుపు

నంద్యాల ముచ్చట్లు:

 

మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పిన వై.ఎస్.ఆర్ . సీపీ ప్రభుత్వం 2022 జూలై 11 నుండి జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ మున్సిపల్ వర్కర్ సీనియర్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య  భాస్కరాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య అధ్యక్షత వహించగా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ యూనియన్ కార్యదర్శి భాస్కరాచారి లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందుకు అనేక వాగ్దానాలు మున్సిపల్ కార్మికులకు ఇచ్చినారని మూడు సంవత్సరాలు పూర్తయిన కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేయడం లేదని ముఖ్యంగా హెల్త్ అలవెన్స్ బకాయిలతో సహా చెల్లించాలని, 11 వ , పీఆర్సీ సిఫార్సుల ప్రకారం నెల జీతం రూ . 26 వేలు మరియు కరువు భత్యం చెల్లించాలని, మున్సిపల్ పారిశుధ్యం , ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చెయ్యాలని,ఇంజనీరింగ్ కార్మికులకు జీఓ ఆర్.టి.నెం .30 సవరించి స్కిల్ , సెమీ స్కిల్డ్ జీతాలు చెల్లించాలని,పర్మినెంట్ కార్మికులకు సరెండర్ లీవ్స్ , జీపీఎఫ్ అక్కౌంట్లు , హెల్త్ కార్డులు ఇవ్వాలని, సీపీఎస్ రదు చేయాలి . ఎన్.ఎం.ఆర్ . లకు టైమ్స్కేల్ , కరువు భత్యం , స్కూల్ ఆయాలకు కనీస వేతనం చెల్లించాలని, పట్టణ విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలి . సకాలంలో కార్మికులకు పనిముట్లు , రక్షణ పరికరాలు అందించాలని,ఆప్కాస్ ద్వారా రిటైర్మెంట్ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ , బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాలి . రిటైర్మెంట్ బెనిఫిట్స్ , గ్రాట్యూటీ – పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.అనంతరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్ష కార్యదర్శులుగా కృష్ణయ్య, భాస్కరాచారి, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, ఆదాము,కరిముల్లా,సహాయకార్యదర్శులుగా నాగేశ్వరరావు,రామాంజనేయులు,డి.నాగేంద్రప్రసాద్ ,మురళి ,కోశాధికారిగా వెంకటరమణ లతో పాటు కమీటి సభ్యులుగా పవన్,బసవయ్య,రాజశేఖర్ ,గురు,ఈశ్వరయ్య,ఎల్ .యం.రెడ్డి ను ఎన్నుకున్నట్లు తెలిపారు.

 

Tags: Make the strike on 11th

Leave A Reply

Your email address will not be published.