నాగబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేయండి
– కార్యకర్తలతో నాగబాబు సమావేశం
భారీగా తరలి రావాలని పిలుపు
– గానిగ బాషా
కర్నూలు ముచ్చట్లు:

జిల్లాలో శనివారం రోజు జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు కొణిదల నాగబాబు చేస్తున్న జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా తెలిపారు, గోనెగండ్లలో నిర్వహించిన పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హల్ నందు ఉదయం 10 గంటలకు వీర మహిళలతో మధ్యాహ్నం 3 గంటలకు జనసైనికులతో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనే లక్ష్యంగా అహర్నిశలు పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ప్రతి జనసేన కార్యకర్త పి ఏ సి సభ్యులు నాగబాబు చేస్తున్న కర్నూలు జిల్లా పర్యటనలో పాల్గొని వారు నిర్వహించే కార్యకర్తల సమావేశానికి భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Tags: Make your trip to Nagababu district a success
