సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన వినోద్ ను సన్మానించిన మాల సంఘం నాయకులు

చొప్పదండి ముచ్చట్లు:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో తల్లా వినోద్ కుమార్ సివిల్ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయిన తాళ్ళ వినోద్ ను వారి తండ్రి తాళ్ళ నర్సయ్యను గురు వారం గంగాధర మాల సంఘం అధ్వర్యంలో షాలువ కప్పి సన్మానం చేశారు.ఈ సందర్భంగా మాల సంఘం నాయకులు మాట్లాడుతూ తాళ్ళ నర్సయ్య పేదరికంతో వృత్తి రీత్యా జీవనోపాధి కొరకు ఆటో నడుపుతూ తన పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచాలని నిరంతరం తాపత్రయ పడుతూ విద్యాబ్యాసం చేపించాడని తల్లి తండ్రుల ఆశయాలను ఆచరణలో పెట్టుకొని తాళ్ళ వినోద్ పట్టుదల కృషితో పోలీసు ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించి సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం పొందాడని తెలిపారు. తాళ్ళ వినోద్ ను వారి కుటుంబ సభ్యులను మాల సంఘం ఆధ్వర్యంలో అభినందించారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ తాళ్ళ శ్రీనివాస్,బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ళ సురేష్,తాళ్ళ అంజయ్య, లక్ష్మణ్, డీలర్ తాళ్ళ నరేష్ పలువురు మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.

 

Tags: Mala community leaders honored Vinod who got job as civil constable

Post Midle
Post Midle