సుప్రీంకోర్టు తీర్పు పై మాలమహానాడు ధర్నా

పుంగనూరు ముచ్చట్లు:

 

ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ సోమవారం అన్నమయ్యజిల్లా సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాలమహానాడు ప్రతినిదులు డాక్టర్‌ యమల సుదర్శనం, ఎన్‌ఆర్‌.అశోక్‌ , కృష్ణప్ప, మల్లెల మోహన్‌, చంద్రయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. పార్లమెంటుకు, రాష్ట్రపతికి సంబంధం లేకుండ ఆర్టీకల్‌ 341 (1)ని సవరించకుండ తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధ్యమాలు ప్రారంభిస్తామని హెచ్చరించారు. దీనిపై సుప్రీంకోర్టు పున ఃసమీక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ తీర్పుతో మాలలకు తీరని ద్రోహం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో హరి, శ్రీనివాసులు, నాగరాజ, భాస్కర్‌, రెడ్డి, మంజు, రమేష్‌, ఆనంద, రెడ్డెప్ప , ఈశ్వర్‌, శీన తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Malamahanadu dharna on the Supreme Court verdict

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *