విజయ దేవరకొండతో మాళవిక

Malavika with Vijaya Devarakonda

Malavika with Vijaya Devarakonda

Date:12/11/2019

ముం బై ముచ్చట్లు:

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె, మలయాళ నటి మాళవికా మోహనన్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. 2013లో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన మాళవిక.. రెండేళ్ల క్రితం ‘బియాండ్ ద క్లౌడ్స్’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. అలాగే, దళపతి విజయ్ 64వ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. విజయ్ దేవరకొండ ‘హీరో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.ఇదిలా ఉంటే, ‘పేట’ సినిమాలో మాళవిక తల్లి పాత్రలో కనిపించారు. పేట వీర ప్రాణ స్నేహితుడు మాలిక్ భార్య పూర్ణగా మాళవిక నటించారు. కాలేజీకి వెళ్లే అబ్బాయికి తల్లిగా డీగ్లామరస్ రోల్‌లో కనిపించారు. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె వేసుకున్న బట్టలు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటాయి. కానీ, బయట మాత్రం ఆమె అలా ఉండరు. పిచ్చ హాట్. ఇన్‌స్టాగ్రామ్‌లో మాళవిక పోస్ట్ చేసే ఫొటోలు చూస్తే ఆమె ఎంత హాటో అర్థమవుతుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో మాళవికకు 7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. హాట్ హాట్ ఫొటోలతో తన ఫాలోవర్లకు కనులవిందును అందిస్తోంది మాళవిక. తాజాగా ఆమె కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు కూడా చాలా హాట్‌గా ఉన్నాయి. బ్లూ, వైట్ మిక్స్‌డ్ వెరైటీ డ్రెస్‌లో హొయలుపోతున్నారు మాళవిక. ‘పేట’ సినిమాలో ఈమెను చూసిన ఎవరైనా ఈ ఫొటోల్లో ఉన్నది మాళవికేనా అని అనుమానపడక మానరు. అంతలా వేరియేషన్ చూపించారు.

 

రాజ‌కీయాల్లో యువతదే కీల‌క పాత్ర

 

Tags:Malavika with Vijaya Devarakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *