చిన్నశేషవాహనం పై మలయప్ప స్వామి

Malayala Swamy on a small child

Malayala Swamy on a small child

 Date:11/10/2018
తిరుమల  ముచ్చట్లు:
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు గురువారం  మలయప్ప స్వామి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. శేషుడు నారాయణాంశ సంభూతుడు. విష్ణువు యొక్క అపరదేహం, ఐదు పడగలు కలిగిన ఈ వాహనంలో రంగనాథ స్వామి ఉత్సవవిగ్రహం తిరుమలలో కొంతకాలం ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందుకు గౌరవ సూచికంగా రెండొవ రోజు ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని చెబుతుంటారు. చిన్నశేషవాహనంపై వేంకటేశ్వరుడు మురళీమనోహారుడు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. పెద్దశేషవాహనాన్ని అదిశేషుడిగానూ, చిన్నశేష వాహనాన్ని వాసుకి సర్పంగానూ భావిస్తారు. ప్రతి మనిషిలొ ఉండే మనోవృత్వులు సర్పకారంలో వ్యాపించి ఉంటాయి. చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడిని దర్శించి, ధ్యానించడం ద్వారా మనిషిలోని మనోవృతులు నశిస్తాయి.
వ్యక్తిలోని కుండలీని సర్ప రూపాపు శిరస్సు, సహస్రారంలోనూ పుచ్చం మూలదారంలోనూ నిల్చినాడు మనిషి నిజంగా మాధవుడికి నిజమైన సేవకుడవుతాడు. చిన్నశేష వాహనాన్ని దర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని పురాణాల్లో పెర్కొనబడింది. ఇక బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు రాత్రికి స్వామి వారు హంస వాహనంపై ఊరేగారు. అయితే చిన్న శేషవాహనాన్ని చూసిన పలువురు భక్తులు ఆశ్చర్యపోయారు. రధంపై వున్న బంగారు పూతపోయింది.  తప్పుపట్టినట్లు ఉంది. వాహనం మొత్తం రాగి లోహంతో కనపడడంతో  భక్తులు మండిపడ్డారు.
Tags:Malayala Swamy on a small child

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *