ఆస్ట్రేలియాలో మేల్ ఎస్కార్ట్

Date:20/05/2019

సిడ్నీ ముచ్చట్లు:

ఆస్ట్రేలియాలో వ్యాపార, ఉద్యోగ పనుల్లో బిజీగా మారిపోయిన కొంతమంది పురుషులు తమ భార్యలకు శారీరక సుఖాన్ని అందించేందుకు మేల్ ఎస్కార్ట్స్‌ని సంప్రదిస్తున్నారట. ఇది రూమర్ కాదు. ఆస్ట్రేలియాలో మేల్ ఎస్కార్ట్‌(మగ వ్యభిచారి)గా పనిచేస్తున్న అలెక్స్(29) అనే వ్యక్తి డైలీ మెయిల్ ఆస్ట్రేలియా అనే వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు. కొంతమంది భర్తలే తమ భార్యలకు శారీరకంగా సుఖాన్ని ఇవ్వమని తనను బుక్ చేస్తున్నారని అలెక్స్ తెలిపాడు. చాలా మంది భర్తలు ఆఫీసు చికాకు వల్ల తమ భార్యలకు శారీరకంగా ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నారని చెప్పుకొచ్చాడు. మహిళలతో సెక్స్ చేసేందుకు తాను గంటకు 500 డాలర్లు వసూలు చేస్తానని, వారానికి రూ.15వేల డాలర్ల వరకు సంపాదిస్తున్నట్లు చెప్పాడు. ఒకరోజు ఓ మహిళను బాగా తృప్తి పరిచినందుకు ఆమె భర్త తనకు వెయ్యి డాలర్లు టిప్‌గా ఇచ్చాడని వెల్లడించాడు. తనను 35-45 మధ్య వయసున్న మహిళలే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని అలెక్స్ తెలిపాడు.

 

 

 

 

 

 

 

 

బిడ్డల తల్లులు, వ్యాపారవేత్తలు, కాలేజీ అమ్మాయిలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారూ శారీరక సుఖం కోసం తనను సంప్రదిస్తున్నారని చెప్పాడు. ఆస్ట్రేలియాలో చాలామంది అమ్మాయిలు 18ఏళ్లకే తమ వర్జినిటీ కోల్పోతున్నారని వెల్లడించాడు. సమయం, నిరాశ.. ఈ రెండు కారణాల వల్లే మహిళలు మేల్ ఎస్కార్ట్‌లను ఎంచుకుంటున్నారని అలెక్స్ చెబుతున్నాడు. 25ఏళ్ల వయసు వరకు జిన్ ట్రైనర్‌గా పనిచేసిన అలెక్స్ ఆ తర్వాత మేల్ ఎస్కార్ట్‌గా మారాడు. మహిళలను తృప్తి పరచడంతో పాటు అపరిచితులతో సెక్స్ చేయాలన్న తన కోరిక మేరకే ఈ వృత్తిలోకి వచ్చినట్లు అలెక్స్ చెబుతున్నాడు. తాను ఓ వెబ్‌సైట్ తరపున పనిచేస్తున్నానని.. కంపెనీ నియమాల ప్రకారం మూడు నెలలకోసారి అన్ని రకాల టెస్ట్‌లు చేయించుకుంటున్నానని తెలిపాడు.

 

ఎగ్జిట్‌పోల్స్పై వైఎస్సార్సీపి శ్రేణుల్లో ఉత్సాహం

 

 

Tags: Male Escort in Australia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *