బెజవాడలో మల్లాది వర్సెస్ వంగవీటి

Malladi versus Vangavati in Bezawada

Malladi versus Vangavati in Bezawada

Date:10/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయం ఊపందుకుంది. పలు కీల‌క స్థానాల్లో టికెట్ల కోసం నా యకులు పోటీ ప‌డుతున్నారు. అధికార పార్టీలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. విప‌క్షం వైసీపీలో మాత్రం పోటీ తీవ్రంగా క‌నిపిస్తోం ది. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కం కావ‌డం.. వైసీపీ నేత‌ల్లో చాలా మంది అధికారంలోకి వ‌చ్చేందుకు ఎదురు చూస్తుండ‌డం, ఆర్థిక స‌మస్య‌లు వంటివి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో టికెట్ సంపాయించ‌డం.. పోటీ చేయడం.. గెల‌వ‌డం.. వంటివి అనివార్యంగా మారాయి. అయితే, కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక టికెట్‌కు ఇద్ద‌రు నుంచి ముగ్గురు వ‌రకు కూడా నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. దీంతో వైసీపీలో పోటా పోటీ వాతావ‌ర‌ణం నెల‌కొంది.ముఖ్యంగా విజయవాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు వైసీపీ టికెట్ కోసం పోరాడుతున్నారు.
వీరిలో ఒక‌రు దివంగ‌త కాపు నేత వంగ‌వీటి రంగా కుమారుడు వంగ‌వీటి రాధా కాగా, అదే వంగ‌వీటి రంగా శిష్యుడు, రాజ‌కీయ ఓన‌మాలు ఆయ‌న ద‌గ్గ‌రే నేర్చిన మ‌ల్లాది విష్ణు‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా మ‌ల్లాది విష్ణు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏడాది కింద‌ట వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సామాజిక వ‌ర్గం బ్రాహ్మ‌ణుల‌కు మంచి ప‌ట్టున్న సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసి గెలిచి తీరాల‌ని మ‌ల్లాది గ‌ట్టు ప‌ట్టుద‌ల‌పై ఉన్నారు. అయితే, తాను విప‌క్షంలో ఉండి గ‌డిచిన నాలుగున్న‌రేళ్లుగా ప్ర‌జ‌ల‌కు సేవ‌చేస్తున్నాన‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాలు చేస్తున్నాన‌ని వంగ‌వీటి రాధా అంటున్నారు.ఈ క్ర‌మంలో మ‌ల్లాది, వంగ‌వీటి ఇద్దరూ కూడా సెంట్ర‌ల్‌నే ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే, ఇటీవ‌ల ఈ టికెట్‌ను మ‌ల్లాదికి కేటాయిస్తున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో వంగ‌వీటి వ‌ర్గం ఆగ్ర‌హ జ్వాల‌లు కురిపించింది.
దీంతో వెన‌క్కి త‌గ్గిన వైసీపీ నాయ‌క‌త్వం.. ఈ విష‌యాన్ని ఎటూ తేల్చ‌కుండా చేసింది. సెంట్ర‌ల్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా విష్ణునే ఉంటార‌ని ప్ర‌క‌టించింది. రాధాకు విజ‌య‌వాడ తూర్పు లేదా మ‌చిలీప‌ట్నం ఎంపీ సీటు ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసింది. అయితే స‌మీక‌ర‌ణ‌ల దృష్ట్యా రాధాకు సెంట్ర‌ల్ సీటే సేప్‌. ఇక వైసీపీ అధిష్టానం ఇచ్చిన ధైర్యంతో టికెట్ త‌న‌దేన‌ని భావించిన మ‌ల్లాది విష్ణు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర ప్రారంభించారు.
రెండు రోజులుగా జ‌రుగుతున్న పాద‌యాత్ర‌లో న‌వ‌ర‌త్నాలు స‌హా వైసీపీ హామీల‌ను క‌ర‌ప‌త్రాలుగా పంచుతున్నారు.ప్ర‌చారం చేస్తున్నారు. దీనిని గ‌మ‌నించిన వంగ‌వీటి వ‌ర్గం ఆదివారం నుంచి తాము కూడా రంగంలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావించిన పోలీసులు అనుమ‌తులు లేవ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
Tags:Malladi versus Vangavati in Bezawada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *