స్లీపర్ సెల్ గా మల్లేపల్లి

హైదరాబాద్   ముచ్చట్లు:
పోలీసులకు, కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు మల్లేపల్లి సవాల్‌గా మారింది. ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా కొరవడటంతో పాటు సెర్చ్‌ ఆపరేషన్లు తగ్గాయి. మర్కాజ్‌ ఘటనతో మల్లేపల్లిపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్‌లో స్లీపర్ సేల్స్‌కు అడ్డాగా మల్లేపల్లి మారింది. మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి ఉంటున్న ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్‌ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు.8 ఏళ్లలో ఆరుగురు ఉగ్రవాదులను మల్లేపల్లిలో ఎన్‌ఐఏ పట్టుకుంది. మల్లేపల్లిలో వస్త్ర దుకాణాలను ఆశ్రయం చేసుకుని ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారు. సూరత్,ముంబై నుంచి వస్త్రాల ఇంపోర్ట్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మల్లేపల్లి ఉండగా, ఆ ప్రాంతంలో 1200లకు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. యూపీ బీహార్ నుండి వచ్చి హోల్ సేల్ వస్త్రాల షాపుల్లో వర్కర్స్ గా మకాం పెడుతున్నారు.దర్భంగా పేలుడుకు హైదరాబాద్‌తో లింక్ ఉందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌ను బుధవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులిద్దరు అన్నాదమ్ముళ్లు. వీరికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వీరి స్వస్థలం యూపీలోని షామ్లీ జిల్లా ఖైరాన. నాసిర్ మాలిక్ 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి మల్లేపల్లి ప్రాంతంలో స్థిరపడ్డాడు. హబీబ్‌నగర్‌లోని మసీదు వద్ద బట్టల షాపు నడుపుతున్నారు. ఐతే బీహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్లో జూన్ 17న బాంబు పేలుడు జరిగింది. ఓ వస్త్రాల పార్సిల్‌లో పేలుడు సంభవించింది. ఐతే సికింద్రాబాద్ నుంచే ఈ పార్సిల్ దర్భంగా వచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అనంతరం తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల సహకారంతో వారిద్దరినీ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.తమ దుకాణం అడ్రెస్‌తోనే నిందితులు పార్సిల్ బుకింగ్ చేశారు. అందులో పేలుడు పదార్థాలను ఉంచి సికింద్రాబాద్- దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో పంపించారు. వస్త్రాలలో బాంబులు పెట్టి పేలచాలని.. ఆ మంటలతో కదులుతున్న రైలును పూర్తిగా దగ్ధం చేయాలన్నది వీరి ప్రణాళిక. అనుకున్నట్లుగానే ఇమ్రాన్ స్థానికంగా దొరికిన రసాయనాలను ఉపయోగించి బాంబు తయారు చేశాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, షుగర్ ఉపయోగించి ఓ 50 ఎంఎల్ మెడిసిన్ బాటిల్‌లో బాంబును సిద్ధం చేశాడు. దానిని ఓ రెడీమేడ్ క్లాత్‌ల ఉంచి రైలులో పార్సిల్ పంపించారు. సరిగ్గా 16 గంటల తర్వాత బాంబు పేలేలా టైమర్ సెట్ చేశారు. కానీ లిక్విడ్ లీకేజీ వల్ల ఆ బాంబు రైల్లో పేలలేదు. ఆ తర్వాత పార్సిల్‌ను రైలు నుంచి బయటకు తీసి.. ఒకటో నెంబర్ ప్లాట్‌పామ్‌పై ఉంచిన తర్వాత పేలింది. లీకేజీ కారణంగా తక్కువ తీవ్రతతో పేలడంతో పెను ప్రమాదం తప్పింది.మొదట దర్భంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జూన్ 24న ఎన్ఐఏ కేసును టేకప్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్ నుంచే పార్సిల్ వచ్చినట్లు గుర్తించారు. జూన్ 15న ఎండీ సూఫియాన్ పేరుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్సిల్ బుక్ చేశారు. ఇక్కడే జాగ్రత్తగా వ్యవహరించారు నిందితులు. పార్సిల్ బుక్ చేసే సమయంలో నకిలీ ఐడెండిటీ కార్డులను సమర్పించారు. కానీ వీరి ప్లాన్ బెడిసి కొట్టింది. రైల్వే పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సహకారంతో ఎన్ఐఏ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.నిందితుల్లో ఒకడైన నాసిర్ మాలిక్ 2012లో పాకిస్తాన్‌కు వెళ్లాడని విచారణలో తేలింది. అందుబాటులో ఉండే రసాయనాలతో బాంబులను ఎలా తయారు చేయాలో లష్కరే తోయిబా ఇతడికి శిక్షణ ఇచ్చింది. నాసిర్ గార్మెంట్ షాపు నడుపుకుంటూనే నిఘా వ్యవస్థకు దొరకకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపేవాడు. ఆన్‌లైన్ వీడియోల ద్వారా కూడా బాంబు తయారీ శిక్షణ పొందాడు. ఇక నాసిర్ మాలిక్ సోదరుడు ఇమ్రాన్ గత ఏడాదే హైదరాబాద్‌‌కు వచ్చినట్లు తెలిసింది. వీరంతా మల్లేపల్లిలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు వెల్లడించారు. వారు ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం పాట్నాకు తరలించారు. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. వీరికి హైదరాబాద్‌లో ఇంకెవరైనా సహకరించారా? దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Mallepally as a sleeper cell

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *