మల్లేపల్లి ప్రభాకర్ ను బేషరతుగా విడుదల చేయాలి

సంగారెడ్డి ముచ్చట్లు:

 

మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(రెడ్ ఫ్లాగ్) తెలంగాణా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ ను  పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(రెడ్ ఫ్లాగ్) ఆంధ్ర ప్రదేశ్-తెలంగాణా సంయుక్త రాష్ట్ర కమిటీలు ఖండించారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు  లింగంపల్లి సత్యవర్ధన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబులు  నేడొక ప్రకటనలో మల్లేపల్లి ప్రభాకర్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసారు. మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణా ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసిన పోలీసులు సంగారెడ్డిలోని ప్రభాకర్ ని తన ఇంటిలోనే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.స్థానిక ఒక నియెాజవర్గ ప్రజాప్రతినిధితో ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, నిరతరం పేద ప్రజల కోసం పనిచేసే విప్లవకారుడు ప్రభాకర్ కాల్ చేసి మాట్లాడటం నేరంగా పరిగణించారు.

 

 

 

భారత శిక్షాస్మృతి సెక్షన్ 384, 506, ఐపిసి 66 ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కేసు నమెాదు చేశారు. కేవలం ఫోన్ సంభాషణ ఆధారంగానే కేసు నమెాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక నియెాజవర్గ ముఖ్యమైన ప్రజాప్రతినిధితో ఫోన్ సంభాషణ చేయకూడదా? సదరు ప్రజాప్రతినిధికి హైదరాబాద్ లో వ్యాపారాలు, వాటి లావాదేవీలు, ప్రజల సాధకబాధకాలు, వ్యాపారాలు సందర్భంగా బాధితులు ప్రభాకర్ కు తమ గొడు వినిపించుకొవటం వలన, బాధితుల తరుపున కాల్ చేసి మాట్లాడవలసిన సందర్భం వచ్చిందని పేర్కొన్నారు. ఫోన్ కాల్ చేయటం, సంభాషణలు చేయటం నేరంగా భావించటం ప్రజాస్వామ్యంలో చెల్ల నేరదన్నారు. కావునా నిరుపేద ప్రజల నాయకుడు, తెలంగాణా రాష్ట్ర జోగీల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు మల్లేపల్లి ప్రభాకర్ పై పెట్టిన కేసును సదరు ప్రజాప్రతినిధి, మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణా ప్రసాద్ తమ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేసారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Mallepally Prabhakar should be released unconditionally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *