ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్ నియామకం

ఒంగోలు  ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా పోలీస్ అధికారి నియామకం విషయంలో కొద్ది రోజులుగా అనేక పేర్లు వినిపించాయి.అయితే రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్  ని కృష్ణా జిల్లా మచిలీట్నానికి ఎస్పీ గా నియమించారు. ఆయన స్థానంలో జిల్లా ఎ.ఎస్పీ చౌడేశ్వరి ని ఇంఛార్జి ఎస్పీగా నియమించారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఎవరు అనే చర్చకు తెర పడింది. కృష్ణ జిల్లా ఎ.ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న మల్లికా గార్గ్ ని ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీ గా నియమించింది. ప్రకాశం జిల్లా ఎస్పీ గా నియమితులైన మల్లికా గార్గ్ పశ్చిమ బెంగాల్ కి చెందిన పోలీస్ అధికారి.మల్లికా గార్గ్ ప్రకాశం జిల్లాలో తొలి మహిళా ఎస్పీ గా చెప్పుకోవచ్చు.

 

మళ్లీ చక్రం తిప్పుతున్న బొత్స

Tags:Mallikagarh appointed as Prakasam District SP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *