మల్లీశ్వరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఎరుకల సామాజిక వర్గాన్ని గౌరవించాలి

Date:23/09/2020

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కు వినతిపత్రం

వరంగల్  ముచ్చట్లు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని గతంలో గిరిజన సామాజిక వర్గంలోని లంబాడా కులానికి చెందిన రాములు నాయక్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని అదే గిరిజన సామాజిక వర్గంలోని ఎరుకల కులానికి చెందిన విద్యావంతురాలు, ఉద్యమకారిని పల్లకొండ మల్లీశ్వరికి ఈ దఫా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఎరుకల సంఘం నాయకులు కోరారు.బుధవారం హైద్రాబాద్ లోని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ను ఆయన కార్యాలయంలో కలిసి మల్లీశ్వరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పల్లకొండ మల్లీశ్వరి తోపాటు ఎరుకల సంఘం నాయకులు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ఏకలవ్యుడి వారసులమైన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన తమకు గత 74 సంవత్సరాల నుండి ఓట్లు వేసుకుంటూ రావడం తప్పా,చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమ పూర్వీకులు చట్టసభలలో అవకాశం కల్పించమని అడగలేదేమో,దాని ఫలితమే నాటి నుండి నేటి వరకు ఎరుకల కులానికి చెందిన విద్యావంతులు, మేధావులు,ఉద్యమకారులు ఉన్నా చట్టసభలలో ఒక్క ఎమ్మెల్యే,ఎంపీ, ఎమ్మెల్సీ,కనీసం నామినేటెడ్ పదవులు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే తమ సామాజిక వర్గానికి దక్కకపోవడం విచారకరమని అన్నారు.గత ఏడు దశాబ్దాలుగా తమ ఎరుకల సామాజిక వర్గం విద్యా,వైద్య రంగాల్లోనే కాక,పారిశ్రామికంగా, రాజకీయంగా,ఆర్ధికంగా,సామాజికంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్నామని, తమ ఎరుకల సామాజిక వర్గాన్ని గుర్తించి,ఆదరించి చట్టసభలలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఎరుకల సామాజిక వర్గానికి చెందిన పల్లకొండ మల్లీశ్వరికి కేటాయించి ఎరుకల కులాన్ని గౌరవించాలని కోరినట్లు తెలిపారు.

 

 

ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే తమకు రాజకీయంగా,విద్యాపరంగా,ఆర్థికంగా, సామాజికంగా తమ కులస్తులను బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.మానవతా దృక్పథంతో తమ ఎరుకల సామాజిక వర్గాన్ని ఆదుకోవాలన్నారు.తమ సామాజిక వర్గ ప్రజలు చాలా వెనుకబడి ఉన్నామని,అన్ని కులాలకు అవకాశాలను కల్పిస్తున్న ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సామాజిక వర్గంలో అట్టడుగు స్థాయిలో వున్న తమకు జనాభా దామాషా ప్రకారం అయినా చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించి,అన్ని సామాజిక వర్గాల్లో ఎలాంటి ప్రక్షాళన చేసి అన్ని వర్గాలకు ఏవిధంగా న్యాయం చేశారో తమ ఎరుకల సామాజిక వర్గానికి కూడా గిరిజన సామాజిక వర్గంలో ప్రక్షాళన చేసి తమ కులస్తులను అభివృద్ధి పరిచినట్లైతే ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరుకల కులస్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.ఎరుకల సామాజిక వర్గానికి రాజకీయ భవిష్యత్తు,చట్టసభల్లో అవకాశం కల్పించిన వారిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎరుకల కులస్తులను ఆదరించి రాజకీయ సమానత్వం కల్పించాలని కోరారు.

 

 

ప్రచార కర పత్రం ఆవిష్కరణ చేసిన డిఎస్పీ

Tags:Mallishwari should be given the post of MLC and the social class of the oil should be respected

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *