సహకార సంఘాల ఎన్నికల్లో మమతాబెనర్జి గట్టి ఎదురుదెబ్బ
– 12 స్థానాలకుగాను 11 స్థానాల్లో బీజేపీ విజయం
కోల్‌కతా ముచ్చట్లు:
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్‌లోని ఓ సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మమతాబెనర్జి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సహకార సంఘంలోని మొత్తం 12 స్థానాలకుగాను టీఎంసీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. మిగతా 11 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.దిగ్రామ్లోని బెకూటియా సమబాయ్ కృషి సమితి అనే సహకార సంఘానికి ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్ ఊహించని రీతిలో ఓటమి పాలైంది. గతంలో బెకూటియా సమబాయ్ కృషి సమితి టీఎంసీ కంచుకోటగా ఉండేది. ఇప్పుడు బీజేపీ ఆ కోఆపరేటివ్ బాడీని సొంతం చేసుకుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతాబెనర్జి ఘోర పరాజయం మూటగట్టుకుంది.అయితే, గత నెలలో జరిగిన సహకార ఎన్నికల్లో తృణమూల్ జయకేతనం ఎగురవేసింది. నందిగ్రామ్ రెండో బ్లాక్‌లో తృణమూల్‌కు 51 స్థానాలు దక్కగా, సీపీఎం ఒక స్థానాన్ని గెలుచుకుంది. అదేవిధంగా హనుభూనియా, గోల్పుకూర్, బిరూలియా సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. పై ఏ ఒక్క సహకార సంఘంలోనూ బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు.

Tags: Mamata Banerjee suffered a severe setback in the co-operative society elections
