Date:23/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
అక్రమంగా 20 లీటర్ల నాటు సారాను విక్రయించేందుకు తీసుకొస్తున్న వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసి , రిమాండుకు తరలించినట్లు ఎస్ఈబి ఎస్ఐ శ్రీధర్ సోమవారం తెలిపారు. మండలంలోని చిన్నతాండాకు చెందిన మూడే రవినాయక్ ద్విచక్రవాహనంలో 20 లీటర్ల సారాను తీసుకొస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఈబి పోలీసులు మనోహర్, హరిప్రసాద్ నాయక్, ఉమామహేశ్వర్, దొరబాబు పాల్గొన్నారు.
Tags: Man arrested including Sarah