పుంగనూరులో వ్యక్తిపై కొడవలితో దాడి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఒంటిమిట్ట గ్రామానికి చెందిన హరినాథ్‌పై అదే గ్రామానికి చెందిన రెడ్డెప్ప, నరసింహులు కొడవలితో దాడి చేయడంతో హరినాథ్ తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం జరిగింది. హరినాథ్‌కు రెడ్డెప్ప, నరసింహులుకు పాతకక్షలు ఉన్నాయి. ఇలా ఉండగా ఉదయం ఇరువురు ఘర్షణ పడి నట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణలో హరినాథ్‌కు తలపైన , చేతిపైన తీవ్ర గాయాలైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tags: Man attacked with machete in Punganur
