మెట్రో ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య
కూకట్ పల్లి ముచ్చట్లు:
మూసాపేట్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ పైకి వస్తున్న మెట్రో ట్రైన్ కింద దూకి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్ పల్లి పోలీసులకు మూసాపేట్ స్టేషన్ కంట్రోలర్ పులెందర్ రెడ్డి ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి టికెట్ లేకుండా మెట్రో స్టేషన్ నుండి ప్లాట్ఫారం పై కి వెళ్లినట్లు గుర్తించారు. తీవ్ర గాయాలు కావడంతో మెట్రో స్టేషన్ వద్ద మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:Man commits suicide after being hit by metro train

