Natyam ad

నీటి ట్యాంక్ పై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

– రక్షించిన పిచ్చాటూరు పోలీసులు

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రాజానగరం గ్రామంలో సుబ్రహ్మణ్యం(42) అనే వ్యక్తి మంగళవారం గ్రామంలోని తాగునీటి ట్యాంక్ పై ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న పిచ్చాటూరు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి హుటాహుటిన తన సిబ్బందితో కలిసి రాజానగరం చేరుకున్నారు. అప్పటికే ట్యాంక్ పై ఉన్న సుబ్రహ్మణ్యం తో చాకచక్యంగా మాట్లాడారు. మెల్లగా ఎస్సై ట్యాంక్ పైకి ఎక్కి సుబ్రహ్మణ్యంకు జీవితం పై బరోసా కల్పించి క్షేమంగా కిందకి దించారు. దీంతో సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం తల్లి కృష్ణవేణి గత వారం పుత్తూరు లో రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకొని మరణించారన్నారు. ఆ బాధను తట్టుకోలేకనే సుబ్రహ్మణ్యం ఆత్మహత్యకు యత్నించాడని వివరించారు. చాకచక్యంగా వ్యవహరించి  నిండు ప్రాణాలను కాపాడిన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పోలీసు సిబ్బందికి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Post Midle

Tags: Man commits suicide by jumping from water tank

Post Midle

Leave A Reply

Your email address will not be published.